telanagana
పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో ఘనంగా దసరా వేడుకలు
సూర్య కరీంనగర్ ప్రతినిధి కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు దసరా పండగ సందర్బంగా నిర్వహించిన ఆయుధ , జమ్మి మరియు వాహన పూజా కార్యక్రమాల్లో పోలీసు కమీషనర్ గౌష్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ కమీషనరేట్ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. కమీషనరేట్ ప్రజలంతా, ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ రిజర్వు ఇన్స్పెక్టర్లు జానీమియా, శ్రీధర్ రెడ్డి , కిరణ్ కుమార్ లతో పాటు ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.