BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

పండగ వేల ప్రయాణికుల పాట్లు.....!

Select Suryaa Now
పండగ వేల ప్రయాణికుల పాట్లు.....!

 

*షాద్‌నగర్‌ బస్టాండ్‌లో బస్సుల కోసం పడిగాపులు!*

*పండుగ రద్దీకి సరిపోని బస్సులు.. గంటల తరబడి నిరీక్షణ*

*సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికుల అవస్థలు..*

*అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌*

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఒకవైపు దసరా పండుగ సెలవులు.. మరోవైపు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్టాండ్‌ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయితే ప్రయాణికుల అవసరాలకు తగినట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ పూట కుటుంబ సభ్యులతో సొంత గ్రామాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దసరా పండుగను పురస్కరించుకొని పట్టణాలు, నగరాల్లో నివసించే అనేకమంది ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు శుక్రవారం షాద్‌నగర్‌ బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో బస్టాండ్‌ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పల్లెలకు వెళ్లే మార్గాల్లో తగినన్ని బస్సులు లేకపోవడంతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. బస్సు రాగానే అందులోకి ఎక్కేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు కనిపించాయి. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చినవారు, చిన్నపిల్లలను వెంట తీసుకొచ్చిన మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ఎన్నికలు కూడా జరగడంతో సిబ్బంది ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు అందించాల్సిన సేవలపై తగినంత దృష్టి సారించలేకపోయారనే అభిప్రాయాలు ప్రయాణికుల నుంచి వ్యక్తమయ్యాయి. అయితే బస్సుల కొరతకు ఎన్నికలే కారణమా, ఇతర నిర్వహణ సమస్యలున్నాయా అన్నది అధికారుల వివరణతో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో ఉండటంతో పండుగ రద్దీ సమయంలో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచకపోతే మహిళలు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బస్సులు వచ్చినప్పుడు వాటిలో సీట్లు దొరకకపోవడం, కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించాల్సి రావడం వంటి సమస్యలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి.

*పండుగ వేళైనా పట్టించుకోరా?*

దసరా వంటి ప్రధాన పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. షాద్‌నగర్‌ నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గాల్లో అదనపు బస్సులు నడపాలని, బస్సుల రాకపోకలపై స్పష్టమైన సమాచారం అందించాలని, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పండుగ పూట సొంతూళ్లకు వెళ్లాలనే ఆనందంతో బస్టాండ్‌కు వచ్చిన ప్రజలకు బస్సుల కోసం పడిగాపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి దసరా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ మార్గాల్లో సర్వీసుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. పండుగ రోజుల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించి, వారి ప్రయాణ కష్టాలకు తెరదించాలని కోరుతున్నారు.. 

జవాజి రాఘవేందర్ గౌడ్: మేజర్ న్యూస్ షాద్నగర్