పాఠశాల పనులు వేగవంతం చేయాలి
పాఠశాల పనులను వేగవంతం చేయాలి
నవంబర్‌లో సీఎం రాక.. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
పనులను పరిశీలించిన విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్
నవంబర్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మంచాల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాల, కళాశాల ప్రాంగణాల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. తరగతి గదులు, ఇతర అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనుల వేగవంతానికి తల్లిదండ్రుల కమిటీ నుంచి సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఓఎస్‌డీ జీనత్, ఈఈ రామ్‌కుమార్, నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి, మంచాల మండల విద్యాధికారి రాందాస్, తహసీల్దార్ ఎం.వి.వి.ఎస్. ప్రసాద్, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు వాణి, నోడల్ ఆఫీసర్ కిషన్ చౌహన్, ఆరుట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, అధికారులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్ మంచాల