BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

ముగిసిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు

Select Suryaa Now
ముగిసిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు

కోహెడ ; కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి . హోరాహోరీ పోటీలో గెలుపొందిన మొదటి విజేత (విన్నర్) కోహెడ టీం కు 10000 నగదు మరియు ట్రోఫీ, రెండవ విజేత ( రన్నర్)  రాయపోలు మండలం వడ్డేపల్లి టీం కు  5000 నగదు మరియు ట్రోఫీ అదేవిధంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు గవ్వ వంశీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా నగదు పురస్కారం మరియు ట్రోఫీని అందించడం జరిగింది. ఈ సందర్భంగా గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తును నిర్ణయించే లక్ష్యంతో ముందుకు సాగాలని, ఎటువంటి దురలవాట్లకు లోనుకాకుండా సామాజిక స్పృహను కలిగి ఉండాలని క్రీడల్లో రాణించాలని తనవంతుగా క్రీడలను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానని, గత 20 ఏళ్లుగా యువతను ప్రోత్సహించడానికి క్రీడల్ని నిర్వహిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నామని ప్రజలకు గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సామాజిక సేవలను అందిస్తూ విద్య, వైద్యం, యువత ను దృష్టిలో పెట్టుకొని ప్రజల కొరకు అహర్నిశలు వివిధ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని భవిష్యత్తులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్ని రంగాలలో కోహెడ ప్రజలకు తోడ్పాటును అందిస్తానని, మహానుభావుల ఆశయాలతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ నాయకులు వక్తలు గవ్వ వంశీధర్ రెడ్డి గారి సేవలను కొనియాడారు వివిధ రకాల ధార్మిక కార్యక్రమాలను నిర్వహించి అదేవిధంగా వైద్య క్యాంపులను నిర్వహించి క్రీడలను ప్రోత్సహించే వివిధ రకాల టోర్నమెంట్ల నిర్వహణ మరియు వారి సేవలు గురించి అనితర సాధ్యమైన వారి కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా యువత పెడదోవన పోకుండా క్రమశిక్షణతో జీవితంలో ఎదగటానికి ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో ప్రాముఖ్యతనిస్తాయని భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమంది రాజకీయ నాయకులకు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొనడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పొన్నాల లక్ష్మణ్ సంకల్ప సేవ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపిటిసి తిప్పారపు నాగరాజు, డా సిహెచ్  దయాకర్, గవ్వ వంశిధర్ రెడ్డి యువసేన సభ్యులు పూసాల రాజశేఖర్
కలికోట రాహుల్ చారి రఘు యాదవ్ అవినాష్ వంశీ, నోమన్ అంజి మనీ తదితరులు పాల్గొన్నారు.