BREAKING
ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు...ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ : గుజరాత్ అంబాజీ ఆలయ మోహన్‌థాల్ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్): పవిత్ర నైవేద్యానికి దక్కిన విశిష్ట గౌరవం!

మూగ, చెవిటి దంపతుల బిడ్డకు అండగా నిలిచి

Select Suryaa Now
మూగ, చెవిటి దంపతుల బిడ్డకు అండగా నిలిచి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మెరుగైన వైద్యం అందేలా చర్యలు
మరో 2 లక్షల ఆర్థికసాయం.. 
స్వయంగా వైద్యులతో మాట్లాడి శస్త్రచికిత్స చేయించిన మంత్రి
చిన్నారి భవిష్యత్తులో విద్యా బాధ్యతలూ తనవేనని భరోసా

 

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇవ్వడమే కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆ కుటుంబంలో ఆశలు నింపడమే నిజమైన మానవత్వం. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి, వారి చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చొరవ తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం వచ్చిన కుటుంబానికి తక్షణ సాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పనిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేష్‌కుమార్‌, రజిత దంపతులిద్దరూ వినికిడి, మాటల సమస్యలతో బాధపడుతున్నారు. వారికి జన్మించిన బిడ్డ కూడా అదే సమస్యతో పుట్టడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారికి సరైన వైద్యం అందిస్తే మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆశ చిగురించింది. అయితే, చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని తెలియడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దంపతులు రెండు రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆశ్రయించారు.

వారి ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి వెంటనే స్పందించి రూ.2 లక్షల తక్షణ ఆర్థికసాయం అందించారు. అంతటితో ఆగకుండా, చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులతో స్వయంగా మాట్లాడి అవసరమైన చికిత్స చేయిస్తానని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ఇచ్చిన మాట ప్రకారం.. చిన్నారికి శస్త్రచికిత్స

బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు మంత్రి చొరవ తీసుకుని హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చిన్నారిని చేర్పించి శస్త్రచికిత్స చేయించారు. శస్త్రచికిత్స పూర్తయిన అనంతరం మంత్రి నేడు ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని ఆప్యాయంగా పలకరించి,కుటుంబ సభ్యులను పరామర్శించి,మరో 2లక్షలు ఆర్థికసాయం అందజేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

శస్త్రచికిత్స అనంతరం స్పీచ్ థెరపీ పూర్తిచేస్తే రానున్న కొన్ని నెలల్లో చిన్నారి మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు వివరించారు. తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందడంతో పాటు, భవిష్యత్తుపై ఆశలు చిగురించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి, బిడ్డకు చికిత్స చేయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

బిడ్డ భవిష్యత్తుకూ భరోసా.. విద్యా బాధ్యతలు నావే

చిన్నారికి వైద్యం అందించడంతోనే తన బాధ్యత ముగిసిపోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. బిడ్డ భవిష్యత్తులో విద్యకు సంబంధించిన పూర్తి బాధ్యతలను తానే తీసుకుంటానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారి భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం,ఎంతో భవిష్యత్ ఉన్న ఓ చిన్నారి జీవితంలో కొత్త ఆశలు నింపడం, ఆ బిడ్డ భవిష్యత్తుకు భరోసా కల్పించడం.. ఇవే ప్రజాసేవకు నిజమైన అర్థమని పలువురు 
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సేవలు కొనియాడుతున్నారు.