మిడ్ మానేరు 4 గేట్లు ఎత్తివేత
మిడ్ మానేరు 4 గేట్లు ఎత్తివేత
- 2000 క్యూసెక్కుల నీరు విడుదల
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్దగల మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల. ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు 4 స్పిల్ వే రేడియల్ గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువ మానేరుకు విడుదల చేశారు.ప్రాజెక్టు నీటిమట్టం 316.66 మీటర్లు దాటడంతో ముందు జాగ్రత్త చర్యగా గేట్లు ఎత్తారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.