BREAKING
మథుర వరకు ఝాన్సీ-ఆగ్రా క్యాంట్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం భుజ్ - బరౌనీ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి వారణాసి నుంచి వడ్ నగర్ సేవా యాత్ర ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు యూపీలోని బహ్రైచ్‌లో చిరుతపులి దాడి.. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దుర్మరణం గ్రామీణ యువతకు భారీ ఆఫర్ అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం-రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి మోదీ హయాంలో దేశానికి రికార్డు విదేశీ పెట్టుబడులు

ధర్మాన కృష్ణదాస్‌తో నరసన్నపేట ప్రజాప్రతినిధుల ఆత్మీయ భేటీ

Select Suryaa Now
ధర్మాన కృష్ణదాస్‌తో నరసన్నపేట ప్రజాప్రతినిధుల ఆత్మీయ భేటీ

​పోలాకి, సెప్టెంబర్ 25 (మేజర్ న్యూస్):

మబగాం క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను నరసన్నపేట మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
​ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నాయకులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ, ప్రజా విశ్వాసాన్ని మరింత చూరగొనేలా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో నరసన్నపేట మండల ఎంపీపీ అరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావులతో పాటు పలువురు ఎంపీటీసీలు, మండల ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.