BREAKING
మథుర వరకు ఝాన్సీ-ఆగ్రా క్యాంట్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం భుజ్ - బరౌనీ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి వారణాసి నుంచి వడ్ నగర్ సేవా యాత్ర ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు యూపీలోని బహ్రైచ్‌లో చిరుతపులి దాడి.. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దుర్మరణం గ్రామీణ యువతకు భారీ ఆఫర్ అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం-రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి మోదీ హయాంలో దేశానికి రికార్డు విదేశీ పెట్టుబడులు

నాగసముద్రలో ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం

Select Suryaa Now
నాగసముద్రలో ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం

అనంతపురం బ్యూరో 

 

నాగసముద్రలో ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం

గుంతకల్లు: రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించేందుకు చేపట్టిన ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం శుక్రవారం గుంతకల్లు మండలం నాగసముద్ర గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం మండల, డివిజన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. భూమి రికార్డుల సవరణలు, ఈ-కేవైసీ, వెబ్‌ల్యాండ్, అడంగల్‌లోని లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీవో, మండల ఇన్‌చార్జి తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, నాగసముద్ర గ్రామ ప్రజలు, గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.