ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
సూర్యకోనరావుపేట
పల్లిమక్త ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇప్పలపల్లి శ్రీనివాస్ ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా శుక్రవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ జిన్న అనూష అనిల్ కుమార్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు .
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయన సేవలు ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులు జి.శ్రీనివాస్, మహేష్‌లను అభినందించారు.ఈ
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, వార్డు సభ్యులు ఉపాధ్యాయులు, ప్రీ-ప్రైమరీ, వాలంటరీ టీచర్లు, ఆయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.