భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం
వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి:
ఎస్ఈ విజయేందర్ రెడ్డి
సూర్య కరీంనగర్ ప్రతినిధి
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ ఎ.విజేందర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, 8712488004 లేదా టోల్‌ఫ్రీ 1912కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
వర్షాల సమయంలో తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలను తాకవద్దని, తడి చేతులతో విద్యుత్ పరికరాలను ఉపయోగించవద్దని సూచించారు. చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. రైతులు మోటార్లు, స్టార్టర్లు, పైపులు, విద్యుత్ లైన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయరాదని సూచించారు. పిల్లలు, పశువులను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉంచాలని తెలిపారు.
“విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా జీవించండి.. సురక్షితంగా వ్యవసాయం చేయండి” అని ఎస్ఈ సూచించారు.