BREAKING
హబ్సిగూడ గణనాథుడి సేవలో అసెంబ్లీ స్పీకర్ మాగుంట పార్వతమ్మ గారి సేవలు చిరస్మరణీయం: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ వర్షాలతో చెరువులోకి వరద నీరు భూముల రీ - సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం మంత్రి ఆనం తో భేటీ అయిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు దీన్‌దయాళ్‌ ఆశయాలే స్ఫూర్తి అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు.. ఎందులో చూడొచ్చంటే! బుక్కరాయసముద్రంలో ఘనంగా దీక్షాంత్ పరేడ్ ఈసీఐ వివాదంపై బీజేపీ కుంటిసాకులు చెప్పడం మానుకోవాలి.. ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు కొండారెడ్డి బురుజు వద్ద హెరిటేజ్ వాక్ సింగనమల మండల స్పెషల్ ఆఫీసర్ గా సిడిపిఓ చల్లా లలితమ్మ బాధ్యతల స్వీకరణ.. శస్త్రచికిత్స అనంతరం సుదర్శన్‌ను పరామర్శించిన బీఎస్ మక్బుల్

ప్రథమ నంది దేవస్థానం వద్ద కూలిపోయిన బ్రిడ్జి సమస్యను శాశ్వతంగా పరిష్క రిస్తాం-రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్

Select Suryaa Now
ప్రథమ నంది దేవస్థానం వద్ద కూలిపోయిన బ్రిడ్జి సమస్యను శాశ్వతంగా పరిష్క రిస్తాం-రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్

-ప్రథమ నంది దేవస్థానం బ్రిడ్జి పునరుద్ధరణ పనులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశం

-కూలిన బ్రిడ్జికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు- నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు ఆమోదం

-మాడవీధిలో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన
నంద్యాల అర్బన్:
నంద్యాలలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ప్రథమ నంది దేవస్థానం వద్ద కూలిపోయిన బ్రిడ్జి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్ స్పష్టం చేశారు.
గత వారంలో కురిసిన వర్షాల ప్రభావంతో ప్రథమ నంది దేవస్థానం వద్ద ఉన్న వంతెన (బ్రిడ్జి) ఒకవైపు కూలిపోవడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను దేవస్థానం చైర్మన్ చలం బాబు మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి, గతంలోనే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో బ్రిడ్జి ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో కూలిపోయిన వంతెనకు తక్షణమే అవసరమైన మరమ్మతు పనులను చేపట్టడంతో పాటు, రాబోయే రోజుల్లో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నూతన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని మంత్రి ఫరూక్ తెలిపారు.
అలాగే ప్రథమ నంది దేవస్థానం ఉత్తరం వైపు ఉన్న మాడవీధి ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన శ్రీవారి ఆలయ స్థలాన్ని కూడా మంత్రి ఫరూక్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ చలం బాబు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ఆర్డీవో విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎమ్మార్వో శ్రీనివాసులు, నంద్యాల టిడిపి మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, చంద్రారెడ్డి, పబ్బతి వేణు, తాటికొండ బుగ్గ రాముడు , మహేష్  మరియు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.