వినాయక నిమజ్జనోత్సవాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
సూర్య జగిత్యాల ప్రతినిధి: తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథులకు జగిత్యాల జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద నిమజ్జనోత్సవాల తీరును జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, తహసీల్దార్ రామ్ మోహన్, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.