BREAKING
విద్యార్థులకు పూర్వ విద్యార్థి చేయూత.. హబ్సిగూడ గణనాథుడి సేవలో అసెంబ్లీ స్పీకర్ మాగుంట పార్వతమ్మ గారి సేవలు చిరస్మరణీయం: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ వర్షాలతో చెరువులోకి వరద నీరు భూముల రీ - సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం మంత్రి ఆనం తో భేటీ అయిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు దీన్‌దయాళ్‌ ఆశయాలే స్ఫూర్తి అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు.. ఎందులో చూడొచ్చంటే! బుక్కరాయసముద్రంలో ఘనంగా దీక్షాంత్ పరేడ్ ఈసీఐ వివాదంపై బీజేపీ కుంటిసాకులు చెప్పడం మానుకోవాలి.. ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు కొండారెడ్డి బురుజు వద్ద హెరిటేజ్ వాక్ సింగనమల మండల స్పెషల్ ఆఫీసర్ గా సిడిపిఓ చల్లా లలితమ్మ బాధ్యతల స్వీకరణ..

కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం వెలికితీత

Select Suryaa Now
కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం వెలికితీత

 


సూర్య కరీంనగర్ ప్రతినిధి 

 

కొత్తపల్లి మండలం బందిపల్లి గ్రామానికి చెందిన తాండ్ర రుద్ర వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా మల్కాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద కెనాల్‌లో ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయిన రుద్ర కోసం పోలీసులు, అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
శుక్రవారం ఎల్‌ఎండీ ప్రాంతంలో రుద్ర మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వెలికితీతను పర్యవేక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రక్రియను త్వరగా పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని అధికారులను మేయర్ ఆదేశించారు.