BREAKING
విద్యార్థులకు పూర్వ విద్యార్థి చేయూత.. హబ్సిగూడ గణనాథుడి సేవలో అసెంబ్లీ స్పీకర్ మాగుంట పార్వతమ్మ గారి సేవలు చిరస్మరణీయం: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ వర్షాలతో చెరువులోకి వరద నీరు భూముల రీ - సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం మంత్రి ఆనం తో భేటీ అయిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు దీన్‌దయాళ్‌ ఆశయాలే స్ఫూర్తి అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు.. ఎందులో చూడొచ్చంటే! బుక్కరాయసముద్రంలో ఘనంగా దీక్షాంత్ పరేడ్ ఈసీఐ వివాదంపై బీజేపీ కుంటిసాకులు చెప్పడం మానుకోవాలి.. ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు కొండారెడ్డి బురుజు వద్ద హెరిటేజ్ వాక్ సింగనమల మండల స్పెషల్ ఆఫీసర్ గా సిడిపిఓ చల్లా లలితమ్మ బాధ్యతల స్వీకరణ..

వైఎస్సార్ నగర్- నందమూరి నగర్ ప్రజలకు సురక్షితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ప్రభుత్వం-రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

Select Suryaa Now
వైఎస్సార్ నగర్- నందమూరి నగర్ ప్రజలకు సురక్షితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ప్రభుత్వం-రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

-కుందూ నది వంతెనను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

-వైఎస్సార్ నగర్, నందమూరి నగర్ ప్రజల రాకపోకల సమస్యపై ప్రత్యేక దృష్టి

-అధికారులతో కలిసి బ్రిడ్జి పరిస్థితిపై సమీక్ష ; శాశ్వత పరిష్కారానికి ఆదేశాలు

నంద్యాల అర్బన్:
నంద్యాల పట్టణ పరిధిలోని వైఎస్సార్ నగర్, నందమూరి నగర్‌లకు రాకపోకలు సాగించే నూతన కుందూ నది బ్రిడ్జిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాంత కాలనీల ప్రజలు ప్రతిరోజూ పట్టణంలోకి వచ్చేందుకు ఈ వంతెనే ప్రధాన ఆధారంగా అవుతుందన్నారు. వర్షాకాలంలో కుందూ నది ప్రవాహం పెరిగినప్పుడు, బ్రిడ్జిపై రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను, వంతెన ప్రస్తుత స్థితిగతులను మంత్రి ఫరూక్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వైఎస్సార్ నగర్, నందమూరి నగర్ ప్రజలకు నిరంతరాయంగా, సురక్షితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు . బ్రిడ్జి పనులు , పటిష్టత పనులకు సంబంధించి తక్షణమే నివేదిక రూపొందించాలని, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.