రేపు కపిసో నూతన ఆడిటోరియం కు భూమిపూజ
01 సూర్య కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ నూతన ఆడిటోరియం కు భూమిపూజ సెప్టెంబర్ 26 శనివారం రోజున జరగనుంది. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఈ ఏడాదితో 49 వసంతాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకొనున్న సందర్భంగా కరీంనగర్ – సిరిసిల్లా బైపాస్ రోడ్డు పద్మనగర్ వద్ద నూతన ఆడిటోరియం కు భూమిపూజ చేయనున్నాము. ఫిల్మ్ సొసైటీ గత 49 సంవత్సరాలుగా సమాంతర సినిమాలను ప్రదర్శిస్తూ, బాలల చలన చిత్రోత్సవాలతో పాటు, అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. ఫిల్మ్ భవన్ వేదికగా ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు చిన్నితెర అనే కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కళాకారులకు మార్గదర్శనం చేస్తూ 24 ఫ్రేమ్స్ లలో పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. కాగా, కార్యక్రమాలను మరింత విస్తృత పరిచేందుకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అన్నీ హంగులతో నూతన ఆడిటోరియం నిర్మించనున్నాము.ఈ భూమిపూజ కార్యక్రమానికి కపిసో సలహాదారులు మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరు అవుతుండగా, ఆత్మీయ అతిథిగా బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విశిష్ట ఆతిథులుగా కార్పొరేటర్లు ఎం. రాజేందర్, గడ్డి ప్రదీప్, పద్మనగర్ మాజీ సర్పంచ్ గడ్డం శ్రీరాములు, కపిసో సలహాదారు వరాల మహేష్, సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ తోపాటు వినియోగదారుల మండలి, వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థల బాధ్యులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కవులు రచయితలు ఔత్సాహిక కళాకారులు, సినీ ప్రియులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయ వలసిందిగా డా. పొన్నం రవిచంద్ర, అధ్యక్షులు,కె. లక్ష్మి గౌతమ్, కార్యదర్శి కోరారు