సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు
సమస్యల పరిష్కారం కోసం రాజంపేట నియోజకవర్గంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. శుక్రవారం స్థానిక రాజంపేట అసెంబ్లీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి పలు అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, అలాగే గ్రామస్థాయిలో కూడా ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారంలో గ్రామాల అభివృద్ధిలో అందుబాటులో ఉంటారని, కూటమి కూటమి మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధితోపాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను చేరుస్తామని, సమస్య ఏదైనా పరిష్కారానికి అడ్డాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పనిచేస్తుందని ఆయన తెలియజేశారు.