BREAKING
హబ్సిగూడ గణనాథుడి సేవలో అసెంబ్లీ స్పీకర్ మాగుంట పార్వతమ్మ గారి సేవలు చిరస్మరణీయం: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ వర్షాలతో చెరువులోకి వరద నీరు భూముల రీ - సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం మంత్రి ఆనం తో భేటీ అయిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు దీన్‌దయాళ్‌ ఆశయాలే స్ఫూర్తి అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు.. ఎందులో చూడొచ్చంటే! బుక్కరాయసముద్రంలో ఘనంగా దీక్షాంత్ పరేడ్ ఈసీఐ వివాదంపై బీజేపీ కుంటిసాకులు చెప్పడం మానుకోవాలి.. ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు కొండారెడ్డి బురుజు వద్ద హెరిటేజ్ వాక్ సింగనమల మండల స్పెషల్ ఆఫీసర్ గా సిడిపిఓ చల్లా లలితమ్మ బాధ్యతల స్వీకరణ.. శస్త్రచికిత్స అనంతరం సుదర్శన్‌ను పరామర్శించిన బీఎస్ మక్బుల్

దేశ సేవలో భాగస్వామ్యమే ఎన్ఎస్ఎస్

Select Suryaa Now
దేశ సేవలో భాగస్వామ్యమే ఎన్ఎస్ఎస్

*దేశసేవలో భాగస్వామ్యమే ఎన్ఎస్‌ఎస్‌ లక్ష్యం*

కేయూ ఉపకులపతి : కే.ప్రతాప్ రెడ్డి

కాకతీయ విశ్వవిద్యాలయంలో  ఘనంగా ఎన్ఎస్ఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

ఎల్.బి కలశాల ప్రోగ్రామ్ ఆఫీసర్లను ప్రశంసించిన వీసీ

వరంగల్ సెప్టెంబర్ 25 మేజర్ న్యూస్ (సూర్య)విద్యార్థులను దేశసేవలో భాగ స్వామ్యం చేయడమే జాతీయ సేవా పథకం(ఎన్ఎస్‌ఎస్‌) ఏర్పాటు లక్ష్యమని  కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.ప్రతాప్ రెడ్డి అన్నారు.జాతీయ సేవా పథకం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.ప్రతాప్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.పచ్చదనం,పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలు అభినందనీయమని అన్నారు.ప్రతి వలంటీర్‌ వ్యక్తిత్వం, క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా లాల్ బహదూర్ కళాశాలకు చెందిన ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఏ.రాఘవేందర్ రెడ్డి,హింగే రాజేశ్వర్ రావు,ఉమ్మగొని శ్రీనివాస్ లకు అప్పగించిన ' హాస్పిటాలిటీ కమిటీ ' కార్యక్రమంలో చాలా చక్కగా వారి విధులను నిర్వహించారని,చాలా దూరం నుండి వచ్చిన వాలంటీర్లకు ఆహారాన్ని సమయానికి అందించడమే కాక ఆడిటోరియం చుట్టుప్రక్కల పరిశుభ్రమైన వాతావరణాన్ని వాలంటీర్ల సహాయంతో ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రోగ్రాం ఆఫీసర్లను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మాజీ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ సీతారాం నాయక్,మాజీ కోఆర్డినేటర్,ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి,మాజీ ఎల్బీ కళాశాల ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ యాదగిరి,వలంటీర్లు పాల్గొన్నారు.