ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి
ఇసుక లారీలతో కోట్ల ఆదాయం..
కానీ అధ్వానంగా ప్రధాన రహదారి
మంగపేట, సెప్టెంబర్ 25, సూర్య మేజర్ న్యూస్: కమలాపురం-ఏటూరునాగారం ఆర్ & బి ప్రధాన రహదారిపై గత మూడేళ్లుగా సుమారు 50 వేల ఇసుక లారీలు తిరిగాయని, టీజీఎండిసి, గిరిజన సొసైటీల ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ మండల అధ్యక్షుడు పోలెబోయిన ఆదినారాయణ తెలిపారు. ప్రతి లారీకి రూ.250 రోడ్డు డ్యామేజ్ ఛార్జీతో సహా వందల కోట్లు వసూలు చేసినా, ఇదే రోడ్డును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు గుంతలమయమై రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గిరిజన రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇసుక ద్వారా వచ్చిన నిధులతోనే ఈ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.