14 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు
*14 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు*
*పాలకుర్తి బాలికల గురుకుల విద్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన*
*ఘటనపై స్పందించి వెంటనే గురుకుల పాఠశాల వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.*
*పాఠశాలలోనికి అనుమతించని పోలీసులు, పాఠశాల సిబ్బంది.*
*విద్యార్ధుల పరిస్థితి గురించి మాట్లాడాకే వేళ్తామని చెప్పిన ఎర్రబెల్లి*
*అనుమతించకపోవడంతో హాస్టల్ ముందు ధర్నా*
పాలకుర్తి (దేవరుప్పుల) సెప్టెంబర్ 25 మేజర్ న్యూస్ (సూర్య):
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బాలికల గురుకుల విద్యాలయంలో మంగళవారం సాయంత్రం 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి స్పందించి విద్యార్థులను పరామర్శించడానకి పాలకుర్తిలోని గురుకుల విద్యాలయం (వెలుగు హాస్టల్) కు చేరుకున్నాడు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకునేందుకు లోనికి వెళ్తున్న ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దానికి నిరసనగా హాస్టల్ ముందు ధర్నా చేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్ మరియు ప్రిన్సిపాల్ తో మాట్లడి విద్యార్ధులకు కల్పించాల్సిన వసతులు కల్పించకపోవడంపై ఇలాంటి ఘటనలు జరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేయడం వలన రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. హాస్టల్ లో 8,9,10 తరగతికి చెందిన విద్యార్థినిలను ఎలుకలు మంగళవారం వారం కరిస్తే ఇప్పటి వరకు కూడా హాస్టల్ వార్డెన్ కానీ ఉపాధ్యాయులు, అధికారులు నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం. ఈ ఘటనపై స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సాంఘీక సంక్షేమ పాఠశాల సెక్రటేరి శారదతో మాట్లడి వివరాలు తెలిపారు. ఆమె స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. వెలుగు హాస్టల్ ఆవరణ మొత్తం తిరిగి పేరుకుపోయి ఇక్కడే పని చేస్తున్న సిబ్బందికి కూడా గతంలో పాము కూడా కరిచిందని తెలిపారు. అజాగ్రత్తగా ఉంటూ విద్యార్థులకు సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే కి చిత్త శుద్ది ఉంటే ఇప్పటికైనా పాఠశాలలను పట్టించుకోని విద్యార్థినీల భవిష్యత్తుకు బరోస కల్పించాలని డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా హాస్టల్ లో విద్యార్ధులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటు అని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్ధుల సౌకర్యాల కోసం అన్ని విధాలా కృషి చేశాను, కానీ ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేదని అన్నారు. రేవంత్ రెడ్డికి విద్యార్ధుల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. తన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో నియంత పాలన నడిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి మండల బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.