అంత్యోదయ స్పూర్తి ప్రదాత, దేశభక్తికి నిలువెత్తు రూపం "పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ"
బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం....
సూర్య కరీంనగర్ ప్రతినిధి
అంత్యోదయ స్పూర్తి ప్రదాత, దేశభక్తికి నిలువెత్తు రూపం "పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ" అని బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కొనియాడారు.భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పార్లమెంట్ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ సమాజాభివృద్ధే ధ్యేయంగా దీన్ దయాల్ జీవితం కొనసాగిందన్నారు. భరతమాత ముద్దుబిడ్డ, దేశోద్ధారకుడయిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన 'ఏకాత్మ మానవతావాదం' భావజాలం దేశ రాజకీయాలకు, సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమన్నారు.
'అంత్యోదయ' సిద్ధాంతమే మన మార్గం అని, సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే ధ్యేయంతో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 'అంత్యోదయ' సిద్ధాంతం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారని తెలిపారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నిస్వార్థ రాజకీయాలు, అంకితభావం, దేశభక్తి నేటి తరానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగానీ శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి ,గుజ్జ శ్రీనివాస్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆడి చెర్ల రాజు , గుంజేటి శివ కుమార్ , కటకం లోకేష్ , ఊగిలే సుధాకార్, ముత్యాల జగన్ రెడ్డి, జోన్ , మండల ఆద్యక్షులు మాడిశెట్టి సంతోష్, పాదo శివరాజ్, జాడి బాల్ రెడ్డి, అవుధూర్తి శ్రీనివాస్, కుంట తిరుపతి, కార్పొరేటర్ లు బండ రమణారెడ్డి, కర్రే అనిల్ , నాంపల్లి శ్రీనివాస్ , దాసరి రమణారెడ్డి బీజేవైఎం నాయకులు గుర్రం వెంకటేష్ కోలా అశోక్ లు
పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.