దేనా దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి..
బీజేపీ నాయకుల నివాళులు.
భారతీయ జనసంఘ్ మాజీ అధ్యక్షుడు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి మండపేట లో శుక్రవారం నిర్వహించారు. మండపేటలో బీజేపీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మండపేట టౌన్ హాల్ వద్ద గల ఉషా క్లినిక్ ఆవరణ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం భారతీయ సమాజ అభివృద్ధి, సమగ్రత, సాంస్కృతిక విలువలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని దేశ అభివృద్ధికి ఆయన ఆలోచనలు దోహదపడ్డాయని పేర్కొన్నారు.దీనదయాళ్ ఉపాధ్యాయ 1952లో భారతీయ జనసంఘ్‌లో చేరి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారని, 1967లో జనసంఘ్ అధ్యక్ష పదవిని చేపట్టే వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారని వివరించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని జనసంఘ్‌ను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ వారపత్రిక ‘పాంచజన్య’, లక్నో దినపత్రిక ‘స్వదేశ్’లకు సంపాదకుడిగా వ్యవహరించారని, శంకరాచార్య జీవిత చరిత్ర, చంద్రగుప్త మౌర్య నాటకం, ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ జీవిత చరిత్ర తదితర పలు రచనలు చేశారని పేర్కొన్నారు.ఆనాటి భారతీయ జనసంఘ్ నేడు భారతీయ జనతా పార్టీగా విస్తరించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత్ ప్రపంచ వేదికపై ప్రాధాన్యత సాధిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో ‘మన ఊరు–మన జెండా’ కో-కన్వీనర్ మద్దుల సుబ్బారావు, పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు పందిరి వీర్రాజు, బీజేపీ ప్రధాన కార్యదర్శి కోటిపల్లి కృష్ణమాచార్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు గురజాపు శ్రీనివాస్, మల్లువలస రాజశేఖర్, శ్రీను, ఖాన్ తదితరులు పాల్గొన్నారు