రైతుల సమస్యలపై సీపీఎం పోరాటం
అనంతపురం బ్యూరో
రైతుల సమస్యలపై సీపీఎం పోరాటం*
*బుక్కరాయసముద్రం మండలంలో జీపు యాత్రలు*
: అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతుల రుణాలు మాఫీ చేయాలని, సాగునీరు–విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ నెల 23 నుంచి 26 వరకు జిల్లా వ్యాప్తంగా జీపు యాత్రలు, 28న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కమిటీ తెలిపింది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ. పంట నష్టపరిహారం అందించాలని, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు