BREAKING
హైదరాబాద్‌లో భారీ భద్రత నడుమ ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర.. హుస్సేన్‌సాగర్ వైపు మహా నిమజ్జనం దేశ సేవలో భాగస్వామ్యమే ఎన్ఎస్ఎస్ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు లోయర్ మానేరు డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం నేపాల్‌లో కుండపోత వర్షాల బీభత్సం.. ఖాట్మండులో పూర్తిగా స్తంభించిన ప్రజా రవాణా నోవో నార్డిస్క్‌తో బిలియన్ డాలర్ల ఒప్పందం: దూసుకెళ్లిన నానెక్సా షేర్లు అంత్యోదయ స్పూర్తి ప్రదాత, దేశభక్తికి నిలువెత్తు రూపం "పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ" భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం దేనా దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఏఐ సవాళ్లు: పుంజుకుంటున్న అనుభవజ్ఞులైన ట్రేడర్ల ప్రాధాన్యత డిఫెన్స్ బంధం బలోపేతానికి వియత్నాం-ఉత్తర కొరియా నిర్ణయం సింగపూర్ జనాభా రికార్డు స్థాయికి: 6.21 మిలియన్లకు చేరిన సంఖ్య 14 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు భారత్-అమెరికా సంబంధాల్లో అనిశ్చితి...ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కలకత్తా హైకోర్టులో తులు మోండల్ కేసుకు ట్విస్ట్.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

ప్రజా సమస్యలపై మంత్రి ఎన్.ఎండి. ఫరూక్ స్పందన

Select Suryaa Now
ప్రజా సమస్యలపై మంత్రి ఎన్.ఎండి. ఫరూక్ స్పందన

-13వ వార్డులో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం

నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణ పరిధిలోని 13వ వార్డు, భీమాస్ హోటల్ సమీపంలో ఉన్న నేషనల్ జూనియర్ కాలేజ్ రోడ్డు సమస్యపై రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టారు. సదరు రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో పాటు, వర్షం పడిన ప్రతిసారీ రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక ప్రజలు మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లారు. కాలేజీ విద్యార్థులు, స్థానికులు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకున్న మంత్రి ఫరూక్ , సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఫరూక్ ఆదేశాలతో సంబంధిత అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. 13వ వార్డు భీమాస్ హోటల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా, గుంతలను పూడ్చేందుకు అవసరమైన 'వెట్‌మిక్స్' మెటీరియల్‌తో ప్యాచ్ వర్క్ (రోడ్డు మరమ్మతు) పనులను వేగవంతంగా చేపట్టారు. సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించినందుకు గాను 13వ వార్డు ప్రజలు, విద్యార్థులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.