BREAKING
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి వారణాసి నుంచి వడ్ నగర్ సేవా యాత్ర ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు యూపీలోని బహ్రైచ్‌లో చిరుతపులి దాడి.. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దుర్మరణం గ్రామీణ యువతకు భారీ ఆఫర్ అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం-రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి మోదీ హయాంలో దేశానికి రికార్డు విదేశీ పెట్టుబడులు తాండూరులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నింగిలోకి ఏఐ డేటా సెంటర్లు రైతుల సమస్యలపై సీపీఎం పోరాటం

జాషువా జయంతిని జయప్రదం చేద్దాం

Select Suryaa Now
జాషువా జయంతిని జయప్రదం చేద్దాం

అనంతపురం బ్యూరో : మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి కార్యక్రమాన్ని జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధాన గేటు ఎదురుగా ఉన్న జాషువా విగ్రహానికి పుష్పమాలలంకరణ, 11 గంటలకు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల మీటింగ్ హాల్‌లో జాషువా సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. కవులు, మేధావులు, సాహితీ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, జాషువా సాహిత్య అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాషువా సాహిత్య పీఠం గౌరవ అధ్యక్షులు పూల నాగరాజు, నిర్వాహకులు హెచ్. నాగలింగయ్య, డాక్టర్ నానీల నాగేంద్ర, తోట నాగరాజు కోరారు. ఈ సందర్భంగా జాషువా 131వ జయంతి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ‘గబ్బిలం’, ‘పిరదౌసి’, ‘క్రీస్తు చరిత్ర’, ‘ముంతాజ్ మహల్’ తదితర రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో జాషువా విశిష్ట స్థానం సంపాదించుకున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.