BREAKING
హైదరాబాద్‌లో భారీ భద్రత నడుమ ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర.. హుస్సేన్‌సాగర్ వైపు మహా నిమజ్జనం దేశ సేవలో భాగస్వామ్యమే ఎన్ఎస్ఎస్ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు లోయర్ మానేరు డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం నేపాల్‌లో కుండపోత వర్షాల బీభత్సం.. ఖాట్మండులో పూర్తిగా స్తంభించిన ప్రజా రవాణా నోవో నార్డిస్క్‌తో బిలియన్ డాలర్ల ఒప్పందం: దూసుకెళ్లిన నానెక్సా షేర్లు అంత్యోదయ స్పూర్తి ప్రదాత, దేశభక్తికి నిలువెత్తు రూపం "పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ" భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం దేనా దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఏఐ సవాళ్లు: పుంజుకుంటున్న అనుభవజ్ఞులైన ట్రేడర్ల ప్రాధాన్యత డిఫెన్స్ బంధం బలోపేతానికి వియత్నాం-ఉత్తర కొరియా నిర్ణయం సింగపూర్ జనాభా రికార్డు స్థాయికి: 6.21 మిలియన్లకు చేరిన సంఖ్య 14 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు భారత్-అమెరికా సంబంధాల్లో అనిశ్చితి...ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కలకత్తా హైకోర్టులో తులు మోండల్ కేసుకు ట్విస్ట్.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

నింగిలోకి ఏఐ డేటా సెంటర్లు

Select Suryaa Now
నింగిలోకి ఏఐ డేటా సెంటర్లు

అంతరిక్షంలో గూగుల్ ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ ప్రయోగం
ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్య బిజినెస్ డెస్క్: అంతరిక్ష రంగంలో సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ (Project Suncatcher) ప్రయోగాత్మక పరీక్షకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (AI) సాంకేతికతకు అవసరమయ్యే భారీ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ శక్తిని భూమిపై నుంచి అంతరిక్షంలోకి తరలించే క్రమంలో గూగుల్ తన టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్లను (TPU) అంతరిక్షంలోకి పంపనుంది. అక్టోబర్ 1వ తేదీన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ఒక ప్రొటోటైప్ శాటిలైట్‌ను గూగుల్ ప్రయోగించనుంది. అంతరిక్షంలో లభించే విపరీతమైన సౌరశక్తిని వినియోగించుకుంటూ కృత్రిమ మేధ డేటా సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించవచ్చా అనే అంశంపై ఈ ప్రయోగంలో భాగంగా కీలక డేటాను సేకరించనున్నారు.

ఈ చారిత్రాత్మక పరిణామంపై బిలియనీర్, స్పేస్ ఎక్స్ అధినేతి ఎలాన్ మస్క్ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ సీనియర్ డైరెక్టర్ ట్రావిస్ బీల్స్ మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే మొత్తం కంప్యూటింగ్ శక్తి అంతరిక్షంలోకే చేరుతుందని, అది దాదాపు 100 శాతానికి చేరువవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పేస్ ఎక్స్ తన సొంత 'స్టార్‌మైండ్' కాన్సెప్ట్ ద్వారా కక్ష్యలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. స్పేస్‌ఎక్స్ సైతం ఎన్విడియా ఆధారిత ఏఐ కంప్యూటర్లను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోందని, స్టార్‌లింక్ శాటిలైట్ల ద్వారా వేగవంతమైన డేటా మార్పిడి సాధ్యమవుతుందని ఎలాన్ మస్క్ ఇదివరకే స్పష్టం చేశారు.

ఈ మూన్‌షాట్ ప్రాజెక్ట్ గురించి గూగుల్ ప్రతినిధి ట్రావిస్ బీల్స్ వివరిస్తూ, ప్రారంభంలో ఇది వినడానికి విడ్డూరంగా అనిపించినా ఆచరణలో సాధ్యమేనని తేలిందని పేర్కొన్నారు. లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోని 'డాన్-డస్క్' కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ద్వారా సూర్యరశ్మి దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా లభిస్తుందని వివరించారు. భూమితో పోలిస్తే అంతరిక్షంలో సౌరశక్తి ఉత్పత్తి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని, తద్వారా భారీ ఏఐ మోడళ్లను రన్ చేయడానికి అయ్యే విద్యుత్ భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చిన్న క్లస్టర్లుగా ఉండే ఉపగ్రహాలను లేజర్ కమ్యూనికేషన్ ద్వారా అనుసంధానించి అంతరిక్షంలోనే భారీ నెట్‌వర్క్ నిర్మించాలని గూగుల్ భావిస్తోంది.

అయితే అంతరిక్షంలో తీవ్రమైన వికిరణం, రోదసిలోని శూన్యంలో చిప్‌లను చల్లబరిచే థర్మల్ కూలింగ్ వ్యవస్థలు, మరియు రాకెట్ ప్రయోగ సమయంలో వచ్చే ఒత్తిడిని గూగుల్ టిపియు చిప్‌లు తట్టుకోగలవా లేదా అనేది ఈ ప్రయోగంలో పరీక్షించనున్నారు. తొలి దశ ప్రయోగం ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా ప్రాజెక్టులోని లోపాలను సరిదిద్ది, తదుపరి మిషన్లను రూపొందించనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ప్రయోగాలు విజయవంతమైతే రాబోయే రోజుల్లో భూమిపై డేటా సెంటర్ల భారం తగ్గి, ఏఐ మౌలిక సదుపాయాలన్నీ అంతరిక్షంలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.