తాండూరులో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
*రాష్ట్ర వ్యాప్తంగా 80శాతం ప్రక్రియ పూర్తి
*అక్టోబర్ 19వరకు పూర్తి చేస్తాం
*సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడి
తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25) తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ 80శాతం పూర్తి కావడం జరిగింది అని రాష్ట్ర ఎన్నిక ల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలోని వివిధ చోట్ల కొనసాగుతున్న సర్ ప్రక్రియ సెంటర్స్ ను శుక్రవారం నాడు సందర్శించారు.ముందుగా ఆర్డీఓ కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయం,ఎంపిటీ హల్ తో పాటు తాండూరు మండలము గౌతాపూర్ గ్రామాన్ని సందర్శించారు.జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ , తాండూరు ఆర్డీఓకార్యాలయం అనిత తొ పాటు పలువురు అధికారులతో కలిసి సెంటర్స్ ను విజిట్ చేశారు ఈ సందర్భంగా మీడియా తొ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతం పూర్తి కావడం జరిగింది అని, వచ్చే నెల అక్టోబర్ 19వరకు పూర్తి చేస్తాం అని అన్నారు. తాండూరు లో కొద్దిగా నెమ్మదిగా ప్రక్రియ సాగుతోంది అని . వేగాన్ని పెంచుతాం అని సీఈఓ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమాలలో తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య. సిఐ పరమేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.రిపోర్టర్ రాంచందర్