లడ్డు వేలం పాట..
సూర్య-నవీపేట్:
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో గణేష్ చవితి ఉత్సవాల్లో భాగంగా లింగమయ్య గుట్ట కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ శివపురి గణేష్ మండలిలో కొలువుదీరిన గణనాథుని లడ్డు ను గురువారం రాత్రి వేలం వేయగా కాలనీకి చెందిన చేపల పోశెట్టి 25 వేల 5 వందల 11 రూపాయలకు కైవసం చేసుకున్నారు. లడ్డు వేలం ముగిసిన తర్వాత గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ వేలం పాటలో లింగయ్య గుట్ట కాలనీవాసుల తో పాటు మండల కేంద్రానికి చెందిన భక్తులు పాల్గొన్నారు.