నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది ఎమ్మెల్యే
నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది ఎమ్మెల్యే
36 లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పటాన్ చెరు ; పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో.. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 83 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 35 లక్షల 30 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నర్రా బిక్షపతి, శ్రీకాంత్ బాలరాజు, వెంకటేష్, హమీద్, మధు, లబ్ధిదారులు పాల్గొన్నారు.