ప్రహరి గోడ నిర్మాణానికి భూమి పూజ..
సూర్య-నవీపేట్:
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం తుంగిని గ్రామంలో 3 లక్షల ఎంపీ నిధులతో గ్రామపంచాయతీ కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డీ మోహన్ రెడ్డి స్థానిక సర్పంచ్ కాంతారావు తో కలిసి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రమీల, ఉప సర్పంచ్ భూమేష్, వార్డు సభ్యులు, కారోబార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.