BREAKING
14 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు భారత్-అమెరికా సంబంధాల్లో అనిశ్చితి...ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కలకత్తా హైకోర్టులో తులు మోండల్ కేసుకు ట్విస్ట్.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి సముద్రంలో నౌకపై చెలరేగిన మంటలు, 29 మంది ప్రయాణికులు సురక్షితం హార్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి అమెరికా, ఇరాన్ చర్చలు మథుర వరకు ఝాన్సీ-ఆగ్రా క్యాంట్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం భుజ్ - బరౌనీ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి వారణాసి నుంచి వడ్ నగర్ సేవా యాత్ర ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి

శ్రీకాంత్ గౌడ్ కుటుంబానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పరామర్శ

Select Suryaa Now
శ్రీకాంత్ గౌడ్ కుటుంబానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే  పరామర్శ

శ్రీకాంత్ గౌడ్ కుటుంబానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జిఎంఆర్ పరామర్శ

కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

పటాన్ చెరు :  పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు,  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లు పరామర్శించారు.శ్రీకాంత్ గౌడ్ తండ్రి గడిల కుమార్ గౌడ్ రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇస్నాపూర్‌లోని శ్రీకాంత్ గౌడ్ నివాసానికి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెళ్లారు. ముందుగా కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, కుమార్ గౌడ్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.అనంతరం ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గడీల కుమార్ గౌడ్ ను పరామర్శించారు. ఇటీవల కుమార్ గౌడ్ తండ్రి గడిల ఈశ్వరయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ  కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.