ట్రాన్స్‌ఫార్మర్‌పై లైన్‌మెన్‌కు విద్యుత్ షాక్
తీవ్ర గాయాలు.. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
దోమ, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25): వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని బాస్‌పల్లి గ్రామంలో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన లైన్‌మెన్ సాయిలు (48) విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. విద్యుత్ పనుల నిమిత్తం ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన లైన్‌మెన్ సాయిలుకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహచరులు, స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.