BREAKING
సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం భుజ్ - బరౌనీ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి వారణాసి నుంచి వడ్ నగర్ సేవా యాత్ర ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు యూపీలోని బహ్రైచ్‌లో చిరుతపులి దాడి.. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దుర్మరణం గ్రామీణ యువతకు భారీ ఆఫర్ అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం-రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి మోదీ హయాంలో దేశానికి రికార్డు విదేశీ పెట్టుబడులు తాండూరులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

వైసిపిని బలోపేతం చెయ్యండి.. ఎర్రకోట

Select Suryaa Now
వైసిపిని బలోపేతం చెయ్యండి.. ఎర్రకోట

నందవరం మండలంలో పార్టీ బలోపేతంపై కీలక చర్చలు

నందవరం, సెప్టెంబర్ 25: నందవరం మండలం ముగతి గ్రామంలో ఎంపీపీ విరుపాక్షి రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి గౌరవప్రదంగా కలిసి ఆత్మీయంగా చర్చించారు.

ఈ సందర్భంగా నందవరం మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, కార్యకర్తలకు అండగా నిలవడం వంటి అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ శ్రేణుల సన్నద్ధత తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు.

గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేస్తూ, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగాలని రాజీవ్ రెడ్డి సూచించారు. నందవరం మండలంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు.