BREAKING
సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం భుజ్ - బరౌనీ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి వారణాసి నుంచి వడ్ నగర్ సేవా యాత్ర ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు యూపీలోని బహ్రైచ్‌లో చిరుతపులి దాడి.. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దుర్మరణం గ్రామీణ యువతకు భారీ ఆఫర్ అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం-రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి మోదీ హయాంలో దేశానికి రికార్డు విదేశీ పెట్టుబడులు తాండూరులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

కోనాడకు తప్పిన పెనుముప్పు

Select Suryaa Now
కోనాడకు తప్పిన పెనుముప్పు


*కోనాడ చంపావతి నది ప్రవాహ పోటు నిరోధ చర్యలకు అడ్డుకట్ట 
*పంచాయతీ కార్యదర్శి ముందుచూపుతో  ముంపును స్థానికుల సహాయంతో  ఇసుకమేటలతో అడ్డుకట్ట  
ఫోటోలు: కోనాడ సాగర తీరంలో కలుస్తున్న నేటి ప్రవాహం ఉధృతం కావడంతో ఇసుకమేటలు వేస్తున్న దృశ్యం 
2. రాత్రి సమయంలో దగ్గరుండి చర్యలు చేపడుతున్న పంచాయతీ కార్యదర్శి 
3 ఉదృతంగా ప్రవహిస్తున్న చంపావతి నది 
పూసపాటిరేగ, సెప్టెంబర్ 25, మేజర్ న్యూస్: తీవ్ర తుఫాను కారణంగా చంపావతి నది జల ప్రవాహ ఉధృతి  కోనాడ సాగర తీరాన్ని తాకడం ను ముందే పసిగట్టిన పంచాయతీ కార్యదర్శి భూషణరావు నివారణ చర్యలు చేపట్టడంతో తీర ప్రాంత గ్రామమైన కోనాడకు పెనుముప్పు తప్పినట్లు అయింది. జిల్లాలోని ఆంధ్ర కొండల నుంచి గజపతినగరం, దత్తిరాజేరు, గర్ల, నెల్లిమర్ల, డెంకాడ మండలాల్లో ఉన్న గ్రామాల మీదగా చంపావతి నది ప్రవహించి చివరికి పూసపాటిరేగ మండలంలోని కోనాడ సాగర తీరంలో కలుస్తుంది. తుఫాన్ల సమయంలో నదీ ప్రవాహం సాగర్ తీరంలో కలిసే సమయంలో అధిక పోటు ఉండడంతో జల ఉధృతికి ఉవ్వెత్తిన ఎగిసపడి కోణాడ పల్లపు ప్రాంతాలను ముంచెత్తేవి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పంచాయతీ కార్యదర్శి భూషణరావు స్థానిక గ్రామస్తులతో మమేకమవుతూ తుఫాను ముంచుకొస్తే ఎగువ ప్రాంతాల నుంచి చంపావతి వరద పోటు సాగర తీరంలో కలిసే సమయంలో ముప్పు ఉంటుందని గ్రహించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ముందు గ్రహించినట్టుగానే గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో వరద పోటు ఉదృతం కావడంతో 100 మీటర్ల దూరంలో ఉన్న మేటలను చీల్చుకుంటూ జల ప్రవాహం చొచ్చుకుంటూ  ముందుకు రావడంతో పంచాయతీ కార్యదర్శి భూషణ్ స్థానికులతో కలిసి సిద్ధం చేసిన ఇసుకమేటల బస్తాలను అడ్డుకట్ట వేసే విధంగా నిరోధక చర్యలు చేపట్టారు. ఇలా మూడు గంటల పాటు పంచాయతీ కార్యదర్శి సహకారంతో స్థానికులు శ్రమించడంతో  కోనాడ ముంపు గ్రామాలైన యాతపేట, కుమ్మరి వీధి, చిన్న వీధి ప్రాంతాలకు వరద పోటు నుంచి గండం తప్పినట్లు అయింది. జలగండం ముప్పు తప్పడంతో కోనాడ పరిసర ప్రాంతాలకు చెందినవారు ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీ కార్యదర్శి నాగభూషణం ముందు చూపుతో అందించిన సహకారం వలనే జల ప్రవాహం నుంచి గండం గడిచి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా బయటపడ్డామంటూ స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.