BREAKING
సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం భుజ్ - బరౌనీ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి వారణాసి నుంచి వడ్ నగర్ సేవా యాత్ర ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు యూపీలోని బహ్రైచ్‌లో చిరుతపులి దాడి.. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దుర్మరణం గ్రామీణ యువతకు భారీ ఆఫర్ అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం-రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి మోదీ హయాంలో దేశానికి రికార్డు విదేశీ పెట్టుబడులు తాండూరులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

గొట్లూరులో 8 సెంట్ల స్థల వివాదంపై మాల సంఘాల పోరాటం

Select Suryaa Now
గొట్లూరులో 8 సెంట్ల స్థల వివాదంపై మాల సంఘాల పోరాటం

అనంతపురం బ్యూరో

గొట్లూరులో 8 సెంట్ల స్థల వివాదంపై మాల సంఘాల పోరాటం

 

పల్లె పిలుపు–మాలల మేలుకొలుపు’ కార్యక్రమంలో భాగంగా గొట్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీకి సంబంధించిన 8 సెంట్ల స్థల వివాదంపై మాల సంఘాల నాయకులు, బాధిత కుటుంబాలు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. 1983 నుంచి ఎస్సీ కాలనీకి కేటాయించిన స్థలంలో 8 సెంట్లను బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన ఐదు కుటుంబాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని మాల సంఘాల నాయకులు ఆరోపించారు.ఈ సమస్యపై సుమారు 100 మంది ధర్మవరం ఆర్డీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిశీలించిన ఆర్డీవో, తహసీల్దార్, సర్వేయర్, వీఆర్వోలతో చర్చించి, సెప్టెంబర్ 26లోపు సంబంధిత కుటుంబాలను పిలిపించి చట్టపరంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.దాదాపు 40 ఏళ్లుగా ఈ స్థలం కోసం పోరాడుతున్నామని, అక్కడ కమ్యూనిటీ భవనం, అంబేద్కర్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని వారు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని మాల సంఘాల నాయకులు తెలిపారు.కార్యక్రమంలో డాక్టర్ కోట్ల గంగాధర్, డాక్టర్ చెరుకూరి గంగులయ్య, ఎం.ఎన్. మూర్తి, డాక్టర్ గడ్డం ముత్యాలప్ప, డాక్టర్ గుమ్మగుట్ట ఈశ్వరయ్య, సుగుమంచి శ్రీనివాసులు, జూటూరు మహేంద్ర, సోమ కుమార్, కోట్ల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.