telanagana
ప్రజల మనస్సుల్లో ఉన్నత పర్వతం
తండ్రి బాటలో తనయుడి అడుగులు.. ప్రజా సేవలో ప్రత్యేక ముద్ర
రైతు బిడ్డగా పుట్టి.. ప్రజల మనిషిగా ఎదిగి.. సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు
కీసర, మేజర్ న్యూస్, (సెప్టెంబర్ 25):రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం.. తండ్రి నుంచి సంక్రమించిన ప్రజా సంబంధాలు.. గ్రామంతో విడదీయరాని అనుబంధం.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే తపన.. ఇవన్నీ కలగలిసి నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగేటి పర్వత్ రెడ్డి ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసుకునేలా చేస్తున్నాయి.
*తండ్రి సత్తిరెడ్డి వారసత్వానికి నిలువెత్తు ప్రతిరూపం:
పర్వత్ రెడ్డి తండ్రి ఎర్రోల సత్తిరెడ్డి సీనియర్ తెలుగుదేశం నాయకుడిగా, గోధుమకుంట గ్రామ సర్పంచ్‌గా ప్రజా జీవితంలో గుర్తింపు పొందారు. ఆయన నుంచి వచ్చిన ప్రజా సంబంధాలు, సేవాభావాన్ని పర్వత్ రెడ్డి తనదైన శైలిలో కొనసాగిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామంలో ఎర్రోల సత్తిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తండ్రి ప్రజా సేవకు గుర్తింపుగా నిలిచింది. కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, గ్రామ చరిత్రలో ఒక గుర్తింపుగా నిలిచేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పర్వత్ రెడ్డి కుటుంబానికి, గ్రామానికి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తోంది.
*ఆపదలో ముందుండే ఆప్తుడు.. కష్టాల్లో కుటుంబ సభ్యుడిలా:
ఎవరైనా అకాల మరణానికి గురైనా.. ఏ కుటుంబంలోనైనా అనారోగ్య పరిస్థితులు ఎదురైనా.. వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను పరామర్శించడం పర్వత్ రెడ్డి సేవా కార్యక్రమాల్లో ప్రధానంగా కనిపించే అంశం. జీవనమే కష్టమైన కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి గ్రామ ప్రజల కోసం ప్రతినిత్యం తాపత్రయపడ్డారు. లాక్‌డౌన్ దృష్ట్యా ప్రతి కాలనీలో పర్యటించి, వారికి అవసరమైన నిత్యావసర సరుకులను స్వచ్ఛందంగా రెండు నెలల పాటు అందించారు.
*యువతలో ఉత్సాహం.. క్రీడలతో చైతన్యం:
యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ ప్రతియేటా క్రీడా పోటీల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా గ్రామీణ యువతలో ప్రతిభను వెలికితీయడంతో పాటు, క్రమశిక్షణ, సామాజిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా యువతకు క్రీడా పోటీలు, సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. క్రీడలను కేవలం వినోదంగా కాకుండా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించే సాధనంగా పర్వత్ రెడ్డి చూస్తున్నారని ఆయనను దగ్గరగా గమనించిన వారు చెబుతున్నారు.
*గోధుమకుంట అభివృద్ధే లక్ష్యం.. సమస్యలపై నిరంతర దృష్టి:
నాగారం డివిజన్‌లోని గోధుమకుంట గ్రామంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై స్పందిస్తూ గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు. గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక అంశంగా మారింది.
*పదవి కోసం కాదు.. ప్రజల కోసం అందుబాటులో:
ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ, ఎవరైనా తమ సమస్యను చెప్పుకునేందుకు స్వేచ్ఛగా తనను కలిసే వాతావరణాన్ని కల్పిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. తాను నమ్మి ఎత్తుకున్న జెండా కాంగ్రెస్ బలోపేతమే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలతో కలిసి ముందుకు అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నారు.
*రాజకీయాలకు మించి.. సామాజిక సేవకు ప్రాధాన్యం:
పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం పర్వత్ రెడ్డి రాజకీయ శైలిలో ప్రత్యేకంగా కనిపించే అంశంగా చెప్పుకోవచ్చు.
*రైతు బిడ్డ నుంచి ప్రజా నాయకత్వం వైపు:
వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన నేపథ్యం.. గ్రామీణ ప్రజల జీవన విధానంపై అవగాహన.. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావాలనే తపన.. ఇవన్నీ పర్వత్ రెడ్డి ప్రజా జీవితానికి బలమైన పునాదులుగా నిలుస్తున్నాయి. గ్రామంతో ఉన్న అనుబంధాన్ని కేవలం రాజకీయ పరిమితుల్లో కాకుండా సామాజిక సంబంధాల రూపంలోనూ కొనసాగిస్తూ ప్రజలతో ఆత్మీయంగా మెలుగుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
*ఒప్పించి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి..
కాలనీల పరంగా విస్తరించిన గోధుమకుంట గ్రామానికి అవసరమైన నిధులను జిల్లా కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పించి ప్రత్యేక నిధులు తీసుకువచ్చిన ఘనత పర్వత్ రెడ్డి సొంతం. ఇప్పటికి నాగారం డివిజన్ పరిధిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభింపజేశారు.
*సేవా కార్యక్రమాలే గుర్తింపు.. ప్రజలే బలం:
పరామర్శ, ఆర్థిక సహాయం, యువతకు క్రీడా ప్రోత్సాహం, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం—ఇలా విభిన్న రంగాల్లో చురుకుగా ఉండటం ద్వారా పర్వత్ రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటున్నారు.ప్రజలకు అందుబాటులో ఉండటం.. ఆపదలో అండగా నిలవడం.. యువతను ప్రోత్సహించడం.. గ్రామ అభివృద్ధికి కృషి చేయడం.. నమ్మిన పార్టీ కోసం పనిచేయడం—ఈ అంశాల సమాహారంగా వంగేటి పర్వత్ రెడ్డి ప్రజా జీవితం కొనసాగుతోంది.రిపోర్టర్ కర్రె గణేష్