BREAKING
జార్ఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షాలతో అస్తవ్యస్తమైన జనజీవనం నంద్యాల జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గత 12 ఏళ్లలో గ్రామీణ మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి అమెరికా-చైనా వైరం ఇప్పట్లో సమసేది కాదు: ట్రంప్-జీ జిన్‌పింగ్ శిఖరాగ్ర భేటీల వెనుక దాగిన వాస్తవాలు అనంత్ చతుర్దశి వేళ ముంబైలో భారీ భద్రత: 24 వేల మంది పోలీసుల పహారా.. 25 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించిన బీఎంసీ ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నోటీసుల వివాదం: క్షేత్రస్థాయి పరిశీలనలో వీఐపీ ఓటర్ల పేర్లకు లైన్ క్లియర్ ప్రజల మనస్సుల్లో ఉన్నత పర్వతం ఇరాన్‌పై ట్రంప్ యుద్ధాధికారాల నియంత్రణ తీర్మానం వీగింపు: అమెరికా సెనేట్‌లో 50-49 ఓట్ల తేడాతో డెమొక్రాట్లకు ఎదురుదెబ్బ వైట్‌హౌస్ వెలుపల జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు: టిబెట్, హాంకాంగ్‌లకు స్వేచ్ఛనివ్వాలంటూ మార్మోగిన నినాదాలు చైనా కార్లపై శాశ్వత నిషేధానికి యూఎస్ సెనేట్ పావులు: జాతీయ భద్రత, డేటా చోరీ ముప్పుతో నూతన ద్వైపాక్షిక బిల్లు ఇరాన్‌పై బాంబుల దాడి అత్యంత సులువైన నిర్ణయం: గాజాలో మారణహోమం ఆరోపణలు శతాబ్దపు అతిపెద్ద అబద్ధమన్న నెతన్యాహు పెద్దాపూర్ గిరి ప్రదక్షిణకు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ గురూజీ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం.. హుస్సేన్‌సాగర్‌ వైపు కదిలిన బడా గణేష్! గ్రీన్ కార్డు విధానంలో సమూల మార్పులకు అమెరికా సరికొత్త బిల్లు: భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్‌లో కలకలం: సుదీర్ఘ విధులతో ఎనిమిది మంది నావికుల ఆత్మహత్యాయత్నం

పెద్దాపూర్ గిరి ప్రదక్షిణకు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ గురూజీ

Select Suryaa Now
పెద్దాపూర్ గిరి ప్రదక్షిణకు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ గురూజీ


సూర్య జూలపల్లి


పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం 6 గంటలకు పెద్దాపూర్ శివారులోని స్వయంభుగా వెలసిన  శ్రీ యోగానంద లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో నిర్వహించనున్న ఏడో గిరి ప్రదక్షిణకు కొండగట్టు గిరి ప్రదక్షిణ సంకల్పకర్త, చిలుకూరు శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ గురూజీ హాజరుకానున్నారని సూర్య విలేఖరి తాటిపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా గురూజీ భక్తులకు సంకల్ప బోధ చేయడంతో పాటు గిరి ప్రదక్షిణను ప్రారంభించేందుకు జెండా ఊపి అనంతరం స్వామివారిని దర్శించుకోనున్నారని పేర్కొన్నారు.పెద్దాపూర్ శివారులోని శ్రీ యోగానంద లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం స్వయంభుగా వెలసిన పుణ్యక్షేత్రంగా భక్తుల్లో ప్రత్యేక విశ్వాసాన్ని కలిగి ఉంది. దక్షిణముఖంగా కొలువైన స్వామివారిని భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. తమ కోర్కెలను స్వామివారికి మొక్కుకుని ముడుపులు కడితే అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. వివాహం, సంతానప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి వంటి శుభకార్యాల కోసం స్వామివారిని ఆశ్రయించి ముడుపులు కట్టే సంప్రదాయం కొనసాగుతోంది.
కొండగట్టు గిరి ప్రదక్షిణ స్ఫూర్తితో ఏప్రిల్‌ 2న ప్రారంభమైన పెద్దాపూర్ గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తున్న గిరి ప్రదక్షణ ఇప్పటికే ఆరు విడతలు పూర్తయ్యాయి. ఆరో గిరి ప్రదక్షిణకు సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు హాజరు కావడం ప్రత్యేకత సంతరించుకుంది.
పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణలో భక్తులు స్వామివారి నామస్మరణతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకోనున్నారు. గిరి ప్రదక్షిణను భక్తి సాధనలో భాగంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు, క్షేత్రానికి వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దాపూర్ గిరి ప్రదక్షిణకు హాజరు కావాలని సూర్య జూలపల్లి మండల విలేకరి తాటిపల్లి శ్రీనివాస్ చేసిన విజ్ఞప్తికి గురూజీ సానుకూలంగా స్పందించడంతో ఆయన రాక ఖరారైంది. ప్రతి పౌర్ణమికి కొండగట్టులో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉదయం 7 గంటలకు సంకల్ప కార్యక్రమం చేపట్టాలనే తన ఆధ్యాత్మిక సంకల్పాన్ని గురూజీ గతంలో వెల్లడించగా పెద్దాపూర్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరితే కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభ సమయానికి చేరుకోవచ్చని శ్రీనివాస్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన అంగీకరించారు.
ఇటీవల విడుదల చేసిన వీడియో సందేశంలో గురూజీ భక్తులు ఏకతాటిపైకి వచ్చి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
గురూజీ పాల్గొనే ఏడో గిరి ప్రదక్షిణకు ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.