కదిరి వైఎస్సార్‌సీపీ లీగల్ టీమ్‌తో సమన్వయకర్త బియస్. మక్బుల్ సమావేశం
అనంతపురం బ్యూరో
కదిరి వైఎస్సార్‌సీపీ లీగల్ టీమ్‌తో సమన్వయకర్త బియస్. మక్బుల్ సమావేశం:
కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బియస్. మక్బుల్ ఆధ్వర్యంలో పార్టీ లీగల్ టీమ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో లీగల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లింగాల లోకేశ్వర రెడ్డి, జి. వెంకటరామి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పఠాన్ జాఫర్ ఖాన్, నియోజకవర్గ లీగల్ సెల్ ప్రతినిధి నాగేంద్ర కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మక్బుల్ వారితో చర్చించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన విధానం తదితర అంశాలపై సూచనలు చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై కూడా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.