రాములపల్లిలో భారీ ధర పలికిన గణేష్ లడ్డూ
సూర్య ఎలిగేడు
ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామంలో మల్లికార్జున యువ యాదవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాటకు భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ఏడాది లడ్డూకు లక్ష రూపాయలకు పైగా ధర పలకడం విశేషంగా నిలిచింది.
గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని పోటీ పడ్డారు. గత పదేళ్లుగా ఇదే మండపంలో లడ్డూ వేలంపాట నిర్వహిస్తుండగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక ధర పలకడం ప్రత్యేకతను సంతరించుకుంది.గణేశుడి లడ్డూను వేలంలో దక్కించుకుని ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబానికి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతోనే ప్రతి ఏడాది గ్రామస్తులు, భక్తులు లడ్డూ వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ఈ ఏడాది భారీ ధరకు లడ్డూ వేలం కావడంతో రాములపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గణనాథుడి ఆశీస్సులతో గ్రామంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.