BREAKING
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు!

మల్కాజిగిరి సమగ్రాభివృద్ధికి నిధులు విడుదల చేయండి: మర్రి రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
మల్కాజిగిరి సమగ్రాభివృద్ధికి నిధులు విడుదల చేయండి:  మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులను  విడుదల చేయాలని స్ధానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. 
మల్కాజిగిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, ఆమోదం పొందిన పనులకు సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు.
గురువారం ఆయన, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం లో తెలంగాణ ప్రభుత్వ మెట్రోపాలిటన్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఎస్ ని మర్యాద పూర్వ కంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,  మల్కాజిగిరి నియోజక వర్గంలో చేపట్టాల్సిన పలు కీలక అభివృద్ధి పనులు, నిధుల విడుదల, రహదారుల విస్తరణ, చెరువుల అభివృద్ధి, క్రీడా సదుపాయాల కల్పన తదితర అంశాలను వివరించారు. మల్కాజి గిరి సర్కిల్ పరిధిలోని బండచెరువు అభివృ ద్ధికి రూ.20 కోట్ల నిధులు విడుదల చేయాల ని, మౌలాలి భరత్‌నగర్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి రూ.10.42 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. నేరేడ్ మెట్ డిఫెన్స్ కాలనీలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి రూ.6.89 కోట్ల నిధులు విడుదల చేయాలని, ఆర్‌కే పురం డివిజన్‌లో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం, పిక్‌బాల్ కోర్టు నిర్మా ణానికి రూ.16.13 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు.గౌతంనగర్ డివిజన్‌ లోని ఏకలవ్య నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్: 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన 1.43 కోట్ల నిధులనువిడుదల చేసి, ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి సహకరించాలన్నారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్లో అప్రూవల్ అయిన 11 గుంటల గ్రామ కంఠం స్థలం  ఫైర్ స్టేషన్ కి అడ్డంకులు తొలగించి ఫైర్ స్టేషన్ నిర్మాణం ఏర్పాటు చేయాలన్నారు.అలాగే, బండ చెరువు అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులను ప్రభుత్వ న్యాయవా దుల ద్వారా వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుని, ప్రాజెక్టు అమలుకు మార్గం సుగ మం చేయాలని ఎమ్మెల్యే కోరారు. తన  వినతికి  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఎస్ సానుకూలంగా స్పందించా రని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, గౌతంనగర్ డివిజన్ పరిధిలో ఉన్న ఏకలవ్య నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన రూ.1.43 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ప్రధాన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, మండలి చిన్నయాదవ్,
నంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.