telanagana
మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాతకు కాంగ్రెస్ నేతల ప్రత్యేక పూజలు
సూర్య నిర్మల్ ప్రతినిధి. :పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కుచాడి శ్రీహరిరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.