BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

మాయమాటలతో డబ్బులు కాజేసిన దొంగ. మూడు గంటల్లోనే పట్టుకున్న కోహెడ పోలీసులు

Select Suryaa Now
మాయమాటలతో డబ్బులు కాజేసిన దొంగ. మూడు గంటల్లోనే పట్టుకున్న కోహెడ పోలీసులు

కోహెడ ; కోహెడ మండలంలోని నాగసముద్రాల గ్రామంలో గ్యాస్ కనెక్షన్ ఉచితంగా మంజూరైందని నమ్మించి ఓ మహిళను మోసం చేసి నగదు కాజేసిన వ్యక్తిని కోహెడ పోలీసులు మూడు గంటల్లోనే పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.28 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కోహెడ ఎస్సై అభిలాష్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే. నాగసముద్రాల గ్రామానికి చెందిన కడారి లచ్చవ్వ ఇంటికి శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చాడు. మీ కుమారుడు రామచంద్రం పేరుపై ఉచిత గ్యాస్ కనెక్షన్ మంజూరైందని, అందుకోసం రూ.2,500 చెల్లించాలని నమ్మించి ఆమె నుంచి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో ఉన్న గ్యాస్ కనెక్షన్‌ను అధికారులు తనిఖీ చేస్తారని, ఇంట్లోని వస్తువులను పరిశీలిస్తారని మాయమాటలు చెప్పాడు.ఈ క్రమంలో ఇంట్లోని బొడ్ల సంచిలో సుమారు రూ.27 వేల నగదు ఉందని గమనించిన నిందితుడు, ఆ సంచిని పీటపై పెట్టగానే దానిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న కోహెడ పోలీసులు ప్రత్యేక బృందం ( ఐడి పార్టీ  ) సహకారంతో రంగంలోకి దిగి. సుమారు మూడు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.28 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అభిలాష్ వెల్లడించారు.
త్వరితగతిన స్పందించి నిందితుడిని పట్టుకున్న కోహెడ పోలీసులకు నాగసముద్రాల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ప్రభుత్వ పథకాల పేరుతో ఇంటికి వచ్చే గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి డబ్బులు ఇవ్వవద్దని, ఇంట్లో నగదు, విలువైన వస్తువులు ఉన్న వివరాలను అపరిచితులకు వెల్లడించవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిందితుని వివరాలు
పర్వతం రాజు తండ్రి రాములు, 33 సం. కులం బుడగ జంగాల 
గ్రామం రఘునాథపల్లి, జనగాం జిల్లా, 
గతంలో కూడా ఇతనిపై చుట్టుపక్కల జిల్లాలలో 15 కు పైగా కేసులు నమోదు కావడం అయినది మరియు ఇతనిపై రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ నందు హిస్టరీ షీట్ కూడా కలదు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని. ఎస్సై  అభిలాష్  కోరుతున్నారు