BREAKING
యాదమరిలో ఎన్నికల బందోబస్తుకు 100 మంది పోలీసులు దేశ సేవే లక్ష్యంగా బీజేపీ నిరంతర కృషి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి ఖర్గే హెచ్చరిక డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు మేకల కాస్తుండగా రైలు ఢీకొని ఓ మహిళా మృతి.. మాల్దీవుల వెకేషన్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి సాక్షి మాలిక్.. గ్లామర్ లుక్ వైరల్ *ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో పులి సంచారం కలకలం!* *అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారుల సూచన* మాస్ ప్రయోగాలకు బ్రేక్.. ఫ్యామిలీ, లవ్ స్టోరీలపై నాని దృష్టి విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

లక్షెట్టిపేటలో రూ.10 నాణేలతో హోండా యాక్టివా కొనుగోలు!

Select Suryaa Now
లక్షెట్టిపేటలో రూ.10 నాణేలతో హోండా యాక్టివా కొనుగోలు!

సూర్య, లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఓ వ్యక్తి కేవలం రూ.10 నాణేలు చెల్లించి కొత్త హోండా యాక్టివా 125 సీసీ స్కూటీని కొనుగోలు చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

లక్షెట్టిపేటలోని వడ్లవాడకు చెందిన రవి జోసెఫ్ వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టిని ఆకర్షించారు. స్థానిక జగదాంబ హోండా షోరూంలో రూ.1,23,000 విలువైన హోండా యాక్టివా 125 సీసీ స్కూటీని కొనుగోలు చేశారు. ఈ వాహనం కొనుగోలు కోసం అవసరమైన మొత్తం నగదును రూ.10 నాణేల రూపంలోనే చెల్లించారు.

షోరూం నిర్వాహకులు పల్లెర్ల గణేష్ కుమార్, కటకం రమేష్‌లకు ఆయన ఈ నాణేలను అందజేశారు. సాధారణంగా నోట్ల రూపంలో జరిగే వాహన కొనుగోలుకు భిన్నంగా, పూర్తిగా రూ.10 నాణేలతో స్కూటీ కొనుగోలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.