కనకదుర్గమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దంపతులు
తాండూరు, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని తాండూరు తాజా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన సతీమణి ఆర్తి రెడ్డితో కలిసి శనివారం దర్శించుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్న రోహిత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.