BREAKING
మామిడిపల్లిలో బాలాజీ ఆలయంలో పూజా సామాగ్రి వేలంపాట కేసీఆర్ పాలన స్వర్ణయుగం కాంగ్రెస్ పాలన రాతియుగం - ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నాణ్యతతోనే సుస్థిర ప్రగతి, స్వయం సమృద్ధి : ఉక్కునగరంలో ఘనంగా ముగిసిన ‘సీసీక్యూసీ-2026’ సదస్సు డిగ్రీ కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు సుజాతనగర్ రోడ్డు పనులపై స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు! పూల సోయగంలో బతుకమ్మ సంబరాలు హెచ్‌ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం – అదనపు కలెక్టర్ విక్టర్ రాజకీయాల్లోకి నా కుటుంబాన్ని లాగొద్దు.. జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచే పోటీ ​రక్తదానమే అసలైన నివాళి నిజ నిర్ధారణ తర్వాతే వార్తలను ప్రచారం చేయాలి - కలెక్టర్ రాజర్షి షా ​ఉద్యోగులకు పెనుముప్పుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025 ఏపీజీఈఏ నోముల పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నారాయణ మెడికల్ కళాశాలలో ఘనంగా 'యువ సంవాద్ మేళా' విద్యాచక్రం కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు ఉపాధ్యాయులు సన్మానం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల దోపిడీపై ఏకం భారత్ పార్టీ గళం

Select Suryaa Now
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల దోపిడీపై ఏకం భారత్ పార్టీ గళం
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల దోపిడీపై ఏకం భారత్ పార్టీ గళం
 
పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- పాల్వంచ, కొత్తగూడెం పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాలకులు, కాంట్రాక్టర్ల దోపిడీకి గురవుతున్నారని ఏకం భారత్ పార్టీ డబ్ల్యూ కె ఎన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బ్రదర్ షఫీ, నాయకులు గజేందర్ దాస్ ఆరోపించారు. శుక్రవారం పాల్వంచలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.కేటీపీఎస్, సింగరేణి తదితర సంస్థల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐలలో గోల్‌మాల్‌ను అరికట్టి ప్రైవేట్ ఏజెన్సీల పెత్తనం రద్దు చేసి డైరెక్ట్ పేమెంట్ ద్వారా నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, పదేళ్లుగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్, భద్రతా ప్రమాణాలు కల్పించాలని బ్రదర్ షఫీ డిమాండ్ చేశారు.పాల్వంచ సంపదను కార్పొరేట్లు దోచుకుంటున్నారని, ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ వర్కర్ల బతుకులు మారలేదని, సమస్యలను మండలిలో ప్రశ్నించే దమ్ము బ్రదర్ షఫీకే ఉందని గజేందర్ దాస్ అన్నారు. పట్టభద్రులైన ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.