కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి. టీజీఐఐసీ మాజీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి.
కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి.
టీజీఐఐసీ మాజీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి.
సదాశివపేట : సదాశివపేట మండలంలోని వెల్టూరు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా సీసీ రోడ్డు 30 లక్షలు కల్వర్టు 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన నిర్మల జగ్గారెడ్డి. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందటం జరుగుతున్నాయని, మరియు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అని చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ గడీల రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చాట్ల సిద్ధన్న, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ కుమార్, ప్రభు, సురేష్, చోటు, మల్లన్న, ఈశ్వర్, సామిల్, రాజు, శ్రీకాంత్ పటేల్, గ్రామపంచాయతీ మెంబర్ సుందర్, రాకేష్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.