BREAKING
శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…! వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక. చంద్రశేఖర్‌కు తాడిపత్రి డీఎస్పీగా బదిలీ.... హాస్పిటల్ ఖర్చుకు గౌరవ వేతనం అందజేసిన దుపల్లి సర్పంచ్ ఎల్‌పీజీ సిలిండర్‌కు నేటి నుంచి కేవైసీ తప్పనిసరి మర్పల్లి పీఏసీఎస్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయాలు! రేపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన మంచిర్యాలలో దారుణ హత్య.. నిందితురాలి అరెస్ట్ ఆసుపత్రి సేవలను పరిశీలించిన హెల్త్‌కేర్ విద్యార్థులు దృశ్యం 3 పై అజయ్ దేవగన్ కీలక ప్రకటన.. మోహన్‌‌లాల్‌తో చర్చల గురించి అసలు నిజం ఏమిటి? విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే గురువు అసలైన విజయం ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2.. అనూహ్యంగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన స్పై థ్రిల్లర్ ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ తిరునగిరి రఘు పదవీ విరమణ సన్మాన సభ పెళ్లికి నో చెబుతున్న టాలీవుడ్ హీరోయిన్లు.. కారణం అదేనా?

కల్యాణ లక్ష్మి దరఖాస్తుల పెండింగ్‌పై మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం

Select Suryaa Now
కల్యాణ లక్ష్మి దరఖాస్తుల పెండింగ్‌పై మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం

సూర్య తెలంగాణ డెస్క్:అర్హత ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం అందించాల్సిన కల్యాణ లక్ష్మి పథకం దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులకు గురి చేయడంపై నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగల్ గిద్ద తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను ఆయన సూటిగా నిలదీశారు. ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని చెప్పి చివరికి మొత్తం కల్యాణ లక్ష్మి పథకానికే ఎగనామం పెడుతోందని విమర్శించారు. నాగల్ గిద్ద గ్రామానికి చెందిన నౌసీన్ బేగం కల్యాణ లక్ష్మి దరఖాస్తు మార్చి నెల నుంచి దాదాపు ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉండటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని విధాలా అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తును ఎందుకు క్లియర్ చేయడం లేదని, నిరుపేద కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. అర్హులైన వారికి పథకం అందకుండా చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చుతున్నారని, తక్షణమే ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో నాగల్ గిద్ద మండలంలో ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ల అంశంపై కూడా తహసీల్దార్‌ను భూపాల్ రెడ్డి గారు గట్టిగా నిలదీశారు. కొన్ని ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తుండగా, మరికొన్ని మాత్రం కొందరి సూచనలతో యథేవిధిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని ప్రస్తావించారు. అన్ని రిజిస్ట్రేషన్లకు ఒకే నిబంధన వర్తిస్తుందా లేదా అని ప్రశ్నిస్తూ, కొన్ని ఆగిపోవడానికి గల అసలు కారణాలు ఏమిటని నిలదీశారు. ఎవరైనా ప్రజాప్రతినిధి చెబితేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా అని, అలా ఆదేశాలు ఇచ్చేది ముఖ్యమంత్రా, మంత్రా, లేక వేరేవారైనా స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయా లేక ఒత్తిళ్ల మేరకు నిర్ణయాలు మారుతున్నాయా అని అడిగారు. ముడుపులు అందిన వారి పనులు చేస్తూ, అందని వారి ఫైళ్లను ఆపుతున్నారనే ఆరోపణలపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పేదల సంక్షేమ పథకాల విషయంలో కాలయాపన చేయడం మరియు భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత లోపించడం వంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. వెంటనే అర్హులైన నిరుపేదలకు కల్యాణ లక్ష్మి ప్రయోజనాలు అందించాలని, రిజిస్ట్రేషన్ల విషయంలో అందరికీ ఒకే నిబంధన వర్తింపజేసి పూర్తి పారదర్శకత పాటించాలని తేల్చిచెప్పారు. పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బాధితులందరితో కలిసి భారీ ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రత్యక్ష నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.