కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. :
సూర్య, నిర్మల్ జిల్లా ప్రతినిధి:నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బతుకమ్మలకు పూజలు చేసి, మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతి, వ్యవసాయం, రైతులతో ముడిపడి ఉందన్నారు. వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులు బయటపడి, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు, అధికారులు, సిబ్బందికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.