కళాశాల విద్యార్థులకు అల్పాహారం...
కళాశాల విద్యార్థులకు అల్పాహారం...
రామాయంపేట; రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులందరికీ అల్పాహార కార్యక్రమం సోమవారం ప్రారంభించడం జరిగిందని ఇన్చార్జి ప్రిన్సిపాల్ గూడూరి మల్లేశం చెప్పారు కళాశాలలో అల్పాహార కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ప్రతిరోజు అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులందరికీ మౌలిక వసతులు కల్పిస్తూ ఉచిత పాఠ్యపుస్తకాలు అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలన్నారు రోజుకు ఒక రకం చొప్పున హరే రామ హరే కృష్ణ సంస్థ ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు