BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

*గ్రోమోర్లో కేళీ వరి విత్తనాలు కలకలం.!

Select Suryaa Now
*గ్రోమోర్లో కేళీ వరి విత్తనాలు కలకలం.!

 *దగా పడ్డ రైతులు. కేళీల  పై ఎ.ఓ కు పిర్యాదు.!                       
*క్షేత్రస్థాయిలో ఏ వో అహమ్మద్ భాషా పరిశీలన.!

మెరకముడిదాం సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్. గర్భాం గ్రోమోర్ సెంటర్లో అమ్మిన కేళీ వరి విత్తనాలు తో రైతులు కకా వికలం అయిపోతున్నారు. గ్రోమోర్ సెంటర్ నుండి కొన్న" జై గణేష్ వరి విత్తనాలు" లో కేలీలు వచ్చి రైతు నడ్డి విరిచాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన మండల వ్యవసాయ అధికారి మీనమే మేషాలు  లెక్కిస్తున్నాను. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఫిర్యాదు వచ్చినప్పుడే అధికారులు స్పందించడం వలు సందేహాలకు తావిస్తుంది. ఇది ముమ్మాటికి విత్తన డీలర్లతో వ్యవసాయ అధికారులు లాలూచీ వ్యవహారమేనని బహిరంగంగానే రైతుల నుండి వ్యవసాయ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. గ్రోమోర్ సెంటర్ పై "మేజర్ న్యూస్" లో పలు కథనాలు వెలువడ్డాయి. జూలై 11 న " గ్రోమోర్ సెంటర్ రైతుల కోసమా! నాయకులు కోసమా! అంటూ, జూలై 13 న  వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం రైతు నెత్తిన శఠగోపం "అంటూ , జూలై 16 న గ్రోమోర్ సెంటర్ తో వ్యవసాయఅధికారులు మిలాఖత్"  పేరుతో పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆ రోజే చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు కేళీ విత్తనాలు కలకలం వచ్చి ఉండేది కాదని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి.  వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో,నిస్సహాయతతో మండలంలో రైతులు ఏదో ఒక దగ్గర నకిలీ విత్తన దెబ్బతో నష్టపోతునే ఉన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి మండలం లో పటిష్టమైన యంత్రాంగం ఉండి కూడా, గర్భాం గ్రోమోర్ సెంటర్లో కేలీ విత్తనాలు కలకలం బయటపడిందంటే అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .మండల వ్యవసాయాధికారి తో  పాటు ప్రతి సచివాలయానికి ఒక దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండి కూడా వీరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే వ్యవసాయ శాఖ అధికారులు విధులు పట్ల ఎంత నిర్లక్ష్యముగా  వ్యవహరిస్తున్నారో చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. విధుల్లో భాగంగా పత్రికల్లో ఫోటోలు కోసం పరిశీలన చేసిన వ్యవసాయ అధికారులు ఫెర్టిలైజర్స్ అండ్ విత్తన షాపులపై శ్రద్ధ పెడితే ఇలాంటి కేళీ విత్తనాలు ను విత్తన డీలర్లు  అమ్మి ఉండేవారు కాదని రైతుల నుండి వ్యవసాయ అధికారులు పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యానికి రైతులు విత్తన డీలర్ల నుండి నిలువు దోపిడీ అయిపోతున్నారు. భైరిపురం, గర్భాం గ్రామాలకు చెందిన కొంత మంది రైతులు గర్భాం గ్రామంలోని  గ్రోమోర్ కేంద్రం నుంచి కొనుగోలు చేసిన" జై గణేష్ సీడ్స్ కంపెనీ" కి చెందిన వరి పంట లో కేలీలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన మండల వ్యవసాయ అధికారి అహమ్మద్ భాష సంబంధిత గ్రోమోర్ కేంద్రం మేనేజర్ మరియు జై గణేష్ సీడ్స్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్‌ను విచారించడం జరిగింది .అనంతరం సంబంధిత రైతుల పొలాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు . ఈ పరిశీలనలో సంబంధిత వరి పంటలో కేళిలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వ్యవసాయ అధికారుల నుంచి తెలియవచ్చింది. ఈ విషయంపై శ్రీ గణేష్ సీడ్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చించి, రైతులకు తగిన విధంగా పరిహారం అందించే విషయాన్ని పరిశీలించి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జై గణేష్ కంపెనీ ప్రతినిధి కి మండల వ్యవసాయ అధికారి సూచించినట్లు తెలియ వచ్చింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అహ్మద్ గౌస్, వ్యవసాయ విస్తరణ అధికారి సుధీర్, గ్రోమోర్ కేంద్రం మేనేజర్, జై గణేష్ సీడ్స్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ మరియు గర్భాం గ్రామ రైతులు బూటి. శ్రీను, బూటు . సత్యనారాయణ, గురయ్యి శివ చైత్ర రైతులు పాల్గొన్నారు