కారుపై కూర్చొని మద్యం తాగుతూ యువతి హల్చల్
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ప్రాంతంలో ఓ యువతి కారుపై కూర్చొని మద్యం తాగుతూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరో వాహనదారుడు తన డాష్క్యామ్లో ఈ ఘటనను రికార్డు చేసినట్లు సమాచారం.కదులుతున్న కారుపై కూర్చొని యువతి మద్యం సేవిస్తున్న దృశ్యాలు కనిపించడంతో ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా ప్రయాణించడమే కాకుండా, మద్యం సేవిస్తూ ఇలా వ్యవహరించడం వల్ల ఇతర వాహనదారులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనపై పోలీసులు స్పందించి, వీడియో ఆధారంగా వివరాలను పరిశీలిస్తారా అనేది తెలియాల్సి ఉంది